Sun Mar 15 2026 09:33:56 GMT+0530 (India Standard Time)
కీలకంగా మారిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్లి సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ [more]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్లి సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ [more]

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్లి సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ నిర్వహిస్తుండటం పట్ల ఆయన అభ్యంతరం తెలపనున్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలిసి ఫలితాల అనంతరం జరిగే విపక్షాల భేటీకి ఎవరెవరినీ ఆహ్వానించాలనే దానిపై చర్చించనున్నారు. కేసీఆర్, జగన్ ను సైతం ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న వేళ చంద్రబాబు వైఖరి కీలకంగా మారింది. అనంతరం చంద్రబాబు లక్నో వెళ్లి మాయవతిని సైతం కలవనున్నారు.
Next Story