Fri Mar 20 2026 05:09:55 GMT+0530 (India Standard Time)
ఎడమ చేయి ఇస్తేనే ఇంత చేస్తారా...?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని నిలదీస్తారని, యుద్ధం చేశారని ఆయన మీడియా ప్రచారం చేసిందని, కానీ బాబు పర్యటన తస్సుమందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...మోదీ ఎడమ చేయి ఇస్తే చంద్రబాబు ఆగడం లేదని, ఇక కుడి చేయి ఇచ్చి ఉంటే భూమి మీద నిలిచేవారు కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలను మోసం చేసేందుకు మోసపూరిత మాటలు, పర్యటనలు మానుకోవాలని ఆయన చంద్రబాబుకు హితవు పలికారు.
Next Story

