Thu Mar 19 2026 02:40:18 GMT+0530 (India Standard Time)
అశోకుడికి ఆహ్వానం

ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ఇంతకు ముందు విజయవాడ నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో అశోక్ బాబును టీడీపీలోకి ఆహ్వానించిన బాబు తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించిన ఎన్జీఓ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరోసారి ఆహ్వానించారు. అశోక్ బాబుకు నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని, టీడీపీలోకి వచ్చిన క్రియాశీలకంగా పనిచేయాలని చంద్రబాబు ఆహ్వానించారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో అశోక్ బాబు అధ్యక్షతన ఏపీ ఎన్జీఓలు పోరాటం చేశారని, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
Next Story

