Sun Mar 15 2026 22:54:46 GMT+0530 (India Standard Time)
విజయవాడలో ‘మెట్రో రైలు’పై కేంద్రం కీలక ప్రకటన

విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబు ఇచ్చిన ఆయన తమకు విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణానికి ఎటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మెట్రో రైల్ విధానానికి అనుగుణంగా విజయవాడలో మెట్రో కోసం ప్రతిపాదనలు పంపాలని 2017 సెప్టెంబర్ లో ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిపాదన పంపలేదని స్పష్టం చేశారు.
Next Story

