Mon Mar 23 2026 06:00:11 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : కేంద్రమంత్రి రాజీనామా

#మీటూ ఉద్యమంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ రాజీనామా చేశారు. అక్బర్ గతంలో ఓ పత్రికలో ఎడిటర్ గా పనిచేసిన సమయంలో తమను లైంగిక వేదింపులకు గురిచేశారని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపణలు చేశారు. మీ టూలో అక్బర్ పై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయితే భారతీయ జనతా పార్టీ అగ్రనేతల సూచన మేరకు అక్బర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అక్బర్ రాజీనామాకు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో ఆయన ఇవాళ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.
Next Story

