Sun Feb 01 2026 18:32:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అవిశ్వాస తీర్మాణానికి సై అన్న కేంద్రం

పార్లమెంటులో టీడీపీ సహా విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై చర్చకు కేంద్రం సిద్ధమని ప్రకటించింది. బుధవారం అవిశ్వాస తీర్మాణంపై ఇచ్చిన నోటీసులను పరిగణలోకి తీసుకున్న స్పీకర్ సుమిత్ర మహజన్ అందుకు మద్దతిచ్చేవారిని నిలబడాల్సిందిగా కోరారు. దీంతో సోనియా గాంధీతో సహా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిలబడంతో అవిశ్వాసంపై చర్చకు కావాల్సిన మద్దతు ఉందని స్పీకర్ తేల్చారు. దీంతో పది రోజుల్లో అవిశ్వాస తీర్మాణంపై చర్చకు సమయం చెబుతామని స్పీకర్ ప్రకటించారు. అయితే, బీజేపీ ప్రభుత్వానికి సభలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజల్లోనూ పూర్తి మద్దతు ఉందని కేంద్రమంత్రి అనంత్ కుమార్ పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మాణంతో పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరవుతాయని ఆయన స్పష్టం చేశారు.
Next Story

