Sun Dec 07 2025 20:00:22 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కేంద్రం సీరియస్… లాక్ డౌన్ పాటించకుంటే?
లాక్ డౌన్ సక్రమంగా అమలు జరగకపోవడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు రోడ్లమీదకు రావడం, గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో కేంద్రం ఆందోళన [more]
లాక్ డౌన్ సక్రమంగా అమలు జరగకపోవడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు రోడ్లమీదకు రావడం, గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో కేంద్రం ఆందోళన [more]

లాక్ డౌన్ సక్రమంగా అమలు జరగకపోవడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు రోడ్లమీదకు రావడం, గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు సక్రమంగా పాటించకుంటే వెంటనే కర్ఫ్యూను అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలను ఆదేశించింది. ప్రజలు రోడ్లపైన తిరగడాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కర్ఫ్యూను విధించాలని ఆదేశించింది. నిత్యవసర వస్తువుల కోసం జనం విపరీతంగా బయటకు వస్తుండటంతో కరోనా మరింత ప్రబలే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది.
Next Story