Thu Jan 29 2026 03:20:20 GMT+0000 (Coordinated Universal Time)
బిపిన్ రావత్ వారసుడు ఆయనేనట
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పదవికి ముకుంద్ నరవణే, ఎయిర్ మార్షల్ రాధాకృష్ణ పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ గా బిపిన్ రావత్ స్థానంలో ఎవరిని నియమించనున్నారు? దీనిపై ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న ముకుంద్ నరవణే, రాధాకృష్ణ, వీరిద్దరి పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ గా ఉన్న బిపిన్ రావత్ నిన్న హెలికాప్టర్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఎవరి పేరు ఖరారు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
కసరత్తు ప్రారంభం....
దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమయినట్లు తెలుస్తోంది. సీడీఎస్ నియామకం తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉంది. చైనా సరిహద్దుల్లో కవ్విస్తుండటం, జమ్మూ కాశ్మీర్ లో పాక్ బలగాలతో సమస్య వంటి కారణాలు తక్షణ నియామకం అవసరాన్ని చెప్పకనే చెబుతున్నాయి. రక్షణ విషయంలో ఆలస్యం చేయకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.
ఇద్దరిలో ఒకరికి...
బిపిన్ రావత్ అంత్యక్రియలు రేపు పూర్తి కానున్నాయి. అంత్యక్రియలు పూర్తయిన వెంటనే సీడీఎస్ నియామకంపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా మనోజ్ ముకుంద్ నరవణే ఉన్నారు. బిపిన్ రావత్ కూడా ఆర్మీ చీఫ్ గా ఉండి సీడీఎస్ గా ఎంపికయ్యారు. అలాగే ఎయిర్ మార్షల్ రాధాకృష్ణను కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈయన ఇప్పుడు సీడీఎస్ కు వైస్ గా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరిని నియమించే అవకాశాలున్నాయి.
- Tags
- bipin rawath
- cds
Next Story

