Mon Dec 15 2025 19:26:19 GMT+0000 (Coordinated Universal Time)
వారంరోజుల్లో ఎన్నికల షెడ్యూల్
రాజ్యసభకు ఎన్నికలను నిర్వహించే యోచనలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంది. కరోనా వైరస్ కారణంగా రాజ్యసభ ఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే [more]
రాజ్యసభకు ఎన్నికలను నిర్వహించే యోచనలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంది. కరోనా వైరస్ కారణంగా రాజ్యసభ ఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే [more]

రాజ్యసభకు ఎన్నికలను నిర్వహించే యోచనలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంది. కరోనా వైరస్ కారణంగా రాజ్యసభ ఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజుల్లో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. రాజ్యసభ ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మార్చి 26వ తేదీన రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశవ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే నామినేషన్లు, ఉపసంహరణ తర్వాత 37 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
Next Story