Mon Mar 23 2026 23:14:02 GMT+0530 (India Standard Time)
జగన్ కు చిరంజీవి ఫోన్

హత్యాయత్నానికి గురైన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు శనివారం లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వచ్చి పరామర్శించారు. మాజీ గవర్నర్ రోశయ్య, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేత చిరంజీవి తదితరులు జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. జగన్ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసి, అవసరమైన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
Next Story

