మాజీ ఎమ్మెల్యే పై సీబీఐ కేసు
గుంటూరు మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు మీద సిబిఐ కేసు నమోదు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు సిబిఐ [more]
గుంటూరు మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు మీద సిబిఐ కేసు నమోదు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు సిబిఐ [more]

గుంటూరు మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు మీద సిబిఐ కేసు నమోదు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు సిబిఐ వెల్లడించింది. తాడిశెట్టి వెంకట్రావు తో పాటు మరొక ఎనిమిది మంది పైన సిబిఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది . పొగాకు వ్యాపారం పేరుతోటి తాడిశెట్టి వెంకటరావు బ్యాంకు వద్ద నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారు. హైదరాబాదులోని ఎస్.బి.ఐలో 92 కోట్ల రూపాయల వరకు రుణాలు తీసుకున్నారు . 20 కోట్ల వరకు తిరిగి చెల్లించడం జరిగింది. మిగతా 72 కోట్ల రూపాయలను గత కొన్నాళ్ల నుంచి చెల్లించకుండా ఉండిపోయారు. అయితే ఈ రుణాలకు సంబంధించి బ్యాంక్ విచారణ చేపట్టినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొగాకు వ్యాపార నిమిత్తం తీసుకున్న రుణాన్ని తన వ్యక్తిగత అవసరాల కోసం తాడిశెట్టి వెంకట్రావు అండ్ కంపెనీ ప్రతినిధులు వాడుకున్నట్లు గా తేలింది. ముఖ్యంగా 72 కోట్ల రూపాయలు ఎక్కువ మొత్తం కూడా వెంకటరావు తన వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసుకున్నట్లుగా తేలింది. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఎస్బీఐ సిబిఐకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సిబిఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

