హైదరాబాద్ లో కరోనా ఆసుపత్రి?
హైదరాబాద్ లో ప్రత్యేకంగా కరోనా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గాంధీ ఆసుపత్రి నగరం నడిబొడ్డున ఉండటం, రోగులతో కిక్కిరిసి పోయి ఉండటంతో ప్రత్యామ్నాయంగా కరోనా [more]
హైదరాబాద్ లో ప్రత్యేకంగా కరోనా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గాంధీ ఆసుపత్రి నగరం నడిబొడ్డున ఉండటం, రోగులతో కిక్కిరిసి పోయి ఉండటంతో ప్రత్యామ్నాయంగా కరోనా [more]

హైదరాబాద్ లో ప్రత్యేకంగా కరోనా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గాంధీ ఆసుపత్రి నగరం నడిబొడ్డున ఉండటం, రోగులతో కిక్కిరిసి పోయి ఉండటంతో ప్రత్యామ్నాయంగా కరోనా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా ఐసోలేటెడ్ వార్డుల నగరం మధ్యలో ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందుకోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ఆసుపత్రిని నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అనంతగిరితో పాటు మరో రెండు ప్రాంతాలను పరిశీలిస్తుంది. కరోనా ఆసుపత్రి అని ప్రత్యేకంగా నిర్మించకపోయినప్పటికీ, ఇలాంటి సమయాల్లో ఉపయోగించుకోవడానికి నగరానికి దూరంగా ఆసుపత్రిని నిర్మించాలని భావిస్తోంది.