Wed Mar 25 2026 22:04:52 GMT+0530 (India Standard Time)
అమరావతిలో సకలజనుల సమ్మె
అమరావతిలో సకల జనుల సమ్మెకు రాజధాని పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. కేవలం రైతులే కాకుండా అమరావతి పరిరక్షణ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని జేఏసీ కోరింది. దుకాణాలతో పాటు [more]
అమరావతిలో సకల జనుల సమ్మెకు రాజధాని పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. కేవలం రైతులే కాకుండా అమరావతి పరిరక్షణ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని జేఏసీ కోరింది. దుకాణాలతో పాటు [more]

అమరావతిలో సకల జనుల సమ్మెకు రాజధాని పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. కేవలం రైతులే కాకుండా అమరావతి పరిరక్షణ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని జేఏసీ కోరింది. దుకాణాలతో పాటు అందరూ ఈ సమ్మెలో పాల్గొనాలని జేఏసీ నేతలు కోరారు. సచివాలయం ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనాలని కోరుతున్నారు. కాగా దుకాణాలను తెరిపించాలనే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన నేడు పదిహేడో రోజుకు చేరుకుంది. అత్యవసరమైన పాలు, మందులు, ఆస్పత్రులకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చారు.
Next Story