Fri Mar 20 2026 17:55:13 GMT+0530 (India Standard Time)
క్యాన్సర్ బారిన పడ్డ క్రికెట్ లెజెండ్

న్యూజిల్యాండ్ కి చెందిన ఒక్కప్పటి క్రికెట్ లెజెండ్ రీచర్డ్ హడ్లీ క్యాన్సర్ బారిన పడ్డారు. 1990లో రిటైరైన ఈ న్యూజిల్యాండ్ బౌలర్ 86 టెస్టు మ్యాచ్ లు ఆడి 431 వికెట్లు తీశారు. 400 వికెట్లు తీసిన మొదటి బౌలర్ గా ఆయన రికార్డు సాధించారు. 66 ఏళ్ల రీచర్డ్ కి ఇటీవల క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఆయనకు ఆపరేషన్ జరిగిందని, వేగంగా కోలుకుంటున్నారని ఆయన భార్య డియెన్నా తెలిపారు. త్వరలోనే కీమోథెరఫీ కూడా జరిపించనున్నట్లు తెలిపారు.
Next Story

