Thu Mar 19 2026 19:52:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రేపు కేబినెట్ భేటీ..!

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తిరిగి హైదరాబాద్ చేసుకోనున్నారు. ఆయన రేపు కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో రేపటి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన రేపటి కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనపడుతోంది. ఢిల్లీ టూర్ లో పరిణామాలపై కేసీఆర్ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.
Next Story

