Sat Jan 31 2026 16:53:23 GMT+0000 (Coordinated Universal Time)
సీఆర్పీఎఫ్ క్యాంప్ పై మహిళ బాంబు దాడి
బుర్ఖా ధరించి వచ్చిన మహిళ తన బ్యాగ్ లో ఉన్న బాంబును బయటికి తీసి సీఆర్పీఎఫ్ క్యాంప్..

జమ్మూకశ్మీర్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ పై ఓ మహిళ బాంబు దాడికి పాల్పడింది. సీఆర్పీఎఫ్ బంకర్ వద్ద జరిగిన ఈ బాంబు దాడిలో ప్రాణనష్టం జరగలేదు. ఎవరూ గాయపడకపోవడంతో జవాన్లు ఊపిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. బుర్ఖా ధరించి వచ్చిన మహిళ తన బ్యాగ్ లో ఉన్న బాంబును బయటికి తీసి సీఆర్పీఎఫ్ క్యాంప్ వైపు విసిరి పరారైంది.
వీడియో ఆధారంగా ఆ మహిళను పోలీసులు గుర్తించారు. త్వరలోనే బాంబు దాడికి పాల్పడిన మహిళను అరెస్ట్ చేస్తామని ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా.. శ్రీనగర్ లోని రైనావారి ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తాయిబాకు చెందిన ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇందులో మాజీ జర్నలిస్ట్ రయీస్ అహ్మద్ భట్ కూడా ఉన్నట్టు కశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు.
Next Story

