Sat Dec 06 2025 03:01:24 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు వన్నీ చీప్ ట్రిక్స్
టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలమయ్యారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఘర్షణ వాతావరణం సృష్టించడానికే [more]
టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలమయ్యారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఘర్షణ వాతావరణం సృష్టించడానికే [more]

టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలమయ్యారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఘర్షణ వాతావరణం సృష్టించడానికే సభకు వచ్చారన్నారు. పోడియం వద్దకు ఆయన వచ్చి కూర్చోవడమేంటని ప్రశ్నించారు. పోలవరం ఎత్తుపై సీఎం జగన్ స్పష్టత ఇచ్చినా అనవసరంగా ఆందోళనకు దిగారన్నారు. స్పీకర్ పై చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగారన్నారు. స్పీకర్ కు తానే ఐదు సార్లు టిక్కెట్లు ఇచ్చానని చంద్రబాబు సభలో చెప్పడమేంటని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు హుందాగా వ్యవహరిస్తే మంచిదని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.
Next Story