Wed Jan 28 2026 20:31:39 GMT+0000 (Coordinated Universal Time)
ముద్రగడను మనస్తాపానికి గురిచేసింది వాళ్లే
ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుంచి తప్పుకోవడానికి వైసీపీ నేతలే కారణమని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. ముద్రగడ జగన్ కు లేఖలు రాసిన తర్వాతే [more]
ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుంచి తప్పుకోవడానికి వైసీపీ నేతలే కారణమని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. ముద్రగడ జగన్ కు లేఖలు రాసిన తర్వాతే [more]

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుంచి తప్పుకోవడానికి వైసీపీ నేతలే కారణమని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. ముద్రగడ జగన్ కు లేఖలు రాసిన తర్వాతే వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ముద్రగడపై విరుచుకుపడుతున్నారని బోండా ఉమ చెప్పారు. అయితే ముద్రగడ ఉద్యమం నుంచి పక్కకు తప్పుకోవడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ల పోస్టుల కారణంగా అనేక మంది మనో వేదనకు గురవుతున్నారని బోండా ఉమ చెప్పారు. త్వరలోనే పదమూడు జిల్లాలకు చెందిన కాపుల సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Next Story