Mon Feb 02 2026 14:24:32 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూలులో భారీ బాంబు పేలుడు

కర్నూలు జిల్లా జోహరాపురంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందగా ఒకరికి గాయలయ్యాయి. ఇక్కడి చెక్ పోస్ట్ సమీపంలో ప్లాట్లు చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పొలానికి కొలతలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు కొంతకాలం ఈ స్థతాన్ని డంపింగ్ యార్డ్ గా వినియోగించారు. దీంతో కొలతలు జరిపేందుకు వీలుగా అక్కడ ఉన్న చెత్తను వారు తగలబెడుతుండగా, ఒక్కసారిగా బాంబులు పేలాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజశేఖర్, మల్లిఖార్జున్, ఏఎస్సై జంపాల శ్రీనివాస్ మృతిచెందారు. గతంలో ఇక్కడ ఎవరైనా దాచిపెట్టిన నాటు బాంబులు పేలి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ప్రాంతానికి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండటంతో ఈ అనుమానాలు నిజమే అని భావిస్తున్నారు.
Next Story

