బొల్లినేని గాంధీ అరెస్ట్ కేసులో కొత్త ట్విస్ట్
జీఎస్టీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చాయి. విచారణ నుంచి తప్పించుకునేందుకు స్వయంగా గాంధీ తప్పుడు ఆరోగ్య పత్రాలతో పాటు తప్పుడు [more]
జీఎస్టీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చాయి. విచారణ నుంచి తప్పించుకునేందుకు స్వయంగా గాంధీ తప్పుడు ఆరోగ్య పత్రాలతో పాటు తప్పుడు [more]

జీఎస్టీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చాయి. విచారణ నుంచి తప్పించుకునేందుకు స్వయంగా గాంధీ తప్పుడు ఆరోగ్య పత్రాలతో పాటు తప్పుడు కరోనా పాజిటివ్ సర్టిఫికెట్లు కూడా సిబిఐకి సమర్పించారు. గత కొన్నాళ్ల నుంచి విచారణకు హాజరుకావాలని సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే సీబీఐ విచారణ తప్పించుకోవడానికి కొత్త కొత్త పద్ధతులతో బొల్లినేని గాంధీ ముందుకెళ్లారు. ముఖ్యంగా తప్పుడు ఆరోగ్య పత్రాన్ని సమర్పించారు. దానితో పాటుగా తనకు కరోనా వచ్చిందని .. హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత తీసుకుంటున్నారని అంటూ తప్పుడు పాజిటివ్ రిపోర్ట్ ను కూడా సిబిఐకి బొల్లినేనిగాంధీ సమర్పించారు. ఈ సర్టిఫికెట్ మీద సిబిఐ అధికారులు విచారణ జరిపారు. బొల్లినేని శ్రీనివాస్ గాంధీ సమర్పించిన ఆరోగ్య పత్రాలతో పాటు కరోనా పాజిటివ్ సర్టిఫికేట్ కూడా తప్పని తేలింది . దీంతో హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో ఉన్న శ్రీనివాస్ గాంధీ నీ సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. శ్రీనివాస్ గాంధీ విచారణకు హాజరు కాకుండా బయట ఉన్న సాక్షులను బెదిరించిన్నట్లు కూడా సిబిఐ విచారణలో బయట పడింది. ఈ నేపథ్యంలో బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని సిబిఐ అధికారికంగా వెల్లడించింది. మరోవైపు మూడు కోట్ల 70 లక్షా రూపాయల సంబంధించిన అక్రమ ఆస్తులను తాము గుర్తించామని సిబిఐ ప్రకటించింది. జిఎస్టి లో పనిచేస్తున్న సమయంలో రెండు కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో తీసుకున్నట్టుగా వుందని అధికారులు వెల్లడించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బొల్లినేని శ్రీనివాస్ గాంధీని అరెస్ట్ చేశారు.

