Sun Feb 01 2026 14:14:12 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : హైదరాబాద్ లో పేలుడు

హైదరాబాద్ నానక్ రాంగూడలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో భారీ పేలుడు సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఫోనెక్స్ టవర్స్ లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. అయితే, కొందరు మృతి చెందారని కార్మికులు చెబుతున్నారు. పేలుడుతో భవనం పక్కనున్న లారీ, రెండు కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. పేలుడు దాటికి దగ్గర ఉన్న మరో భవనంలోనూ ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే, సంఘటనా స్థలానికి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Next Story

