Sat Mar 07 2026 20:58:25 GMT+0530 (India Standard Time)
జూబ్లీహిల్స్ లో పేలుడు… ఒకరికి గాయాలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వెంకటగిరిలో పేలుడు సంభవించింది. స్థానికంగా కూలి పనిచేసుకునే వ్యక్తికి ఎవరో ప్లాస్టీక్ డబ్బా ఇచ్చి అమ్ముకొమ్మని చెప్పారు. దీంతో అతను ఆ డబ్బాను [more]
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వెంకటగిరిలో పేలుడు సంభవించింది. స్థానికంగా కూలి పనిచేసుకునే వ్యక్తికి ఎవరో ప్లాస్టీక్ డబ్బా ఇచ్చి అమ్ముకొమ్మని చెప్పారు. దీంతో అతను ఆ డబ్బాను [more]

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వెంకటగిరిలో పేలుడు సంభవించింది. స్థానికంగా కూలి పనిచేసుకునే వ్యక్తికి ఎవరో ప్లాస్టీక్ డబ్బా ఇచ్చి అమ్ముకొమ్మని చెప్పారు. దీంతో అతను ఆ డబ్బాను ఇంటికి తీసుకువచ్చి.. డబ్బా లోపలి గుర్తు తెలియని పదార్థాన్ని పడేసి ఖాళీ డబ్బాను అమ్ముదామని ప్రయత్నించాడు. డబ్బా తెరవగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో సదరు వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. పేలుడు ధాటికి భారీ శబ్ధం రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Next Story