Mon Mar 23 2026 17:52:23 GMT+0530 (India Standard Time)
అంధకారంలో ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఉధృతంగా ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంది. ఇవాళ రాత్రి 7గంటల నుంచి 7.30గంటల వరకూ ఏపీలోని 13 జిల్లాల్లో విద్యుత్తు దీపాలను ఆర్పివేసి తమ నిరసనను తెలియజేయాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈరోజు విపక్షాలు బ్లాక్ డే గా ప్రకటించాయి. బిజిలీ బంద్ కు ఏపీలోని ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు. బిజిలీ బంద్ లో సీపీఐ, సీపీఎం, వైసీపీతో పాటు ప్రర్యేక హోదా సాధన సమితి కూడా పాల్గొంది. ప్రస్తుతం ఏపీలో తమ ఇళ్లలోని విద్యుత్తు దీపాలను ఆర్పివేసి ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. 13 జిల్లాల్లో ప్రస్తుతం ఈ నిరసన కొనసాగుతుంది..
Next Story

