Fri Dec 05 2025 23:23:04 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో బీజేపీ కూడా బస్సుయాత్ర

టీడీపీపై బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము 175 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. తాము కూడా ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు బస్సుయాత్రను త్వరలో చేస్తామని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు జగన్ ఉచ్చులో పడ్డారన్నారు. బీజేపీ, వైసీపీ కలిసి పోయిందన్నది తప్పుడు ప్రచారమని విష్ణుకుమార్ రాజు అన్నారు. విభజన హామీలు అమలు చేస్తామని కేంద్రం చెబుతున్నా టీడీపీ రాజకీయ ప్రయోజనాలను ఆశించే బయటకు వెళ్లిందన్నారు. బ్యాంకుల్లో డబ్బు కొరతకు ఇసుక మాఫియా కారణమని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story
