Sat Mar 21 2026 14:08:51 GMT+0530 (India Standard Time)
బీజేపీతో పొత్తుపై మేకపాటి క్లారిటీ

బీజేపీతో వైసీపీ పొత్తుపెట్టుకుంటుందని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఏ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోమని, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా మేము కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా అసెంబ్లీ స్థానాలు పెంచుకోవడం, డబ్బుల కోసం ప్రత్యేక ప్యాకేజీ, జగన్ ను కేసుల్లో ఇబ్బంది పెట్టడం కోసమే చంద్రబాబు కేంద్రం వద్ద ప్రయత్నాలు చేశారని విమర్శించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పడిపోతుందని ఎన్నికలకు సంవత్సరం ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
Next Story

