Tue Mar 24 2026 08:56:17 GMT+0530 (India Standard Time)
సీఎం ఇంటికి వెళితే పూలదండలతో సత్కరిస్తారా?

రాష్ట్రంలో జరిగిన అన్ని పనుల్లో చంద్రబాబు తన అనుచరులకే అప్పగించారని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టులో కూడా లేబర్ సెస్సును కాంట్రాక్టర్ నుంచి ఎందుకు వసూలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. చివరకు స్పీకర్ కూడా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడాన్ని విష్ణుకుమార్ రాజు తప్పుపట్టారు. అలాగే ఢిల్లీలో టీడీపీ ఎంపీల నిరసన వింతగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఎద్దేవా చేశారు. ప్రధాని మంత్రి నివాసానికి అనుమతి లేకుండా వెళితే అరెస్ట్ చేయరా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలిపితే వారిని పూలదండలతో సత్కరిస్తారా? అని చమత్కరించారు. కేంద్రసాయాన్ని టీడీపీ గుర్తించలేదన్నారు. ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు తర్వాత యూటర్న్ తీసుకోవడం విడ్డూరమన్నారు.
Next Story

