Fri Mar 20 2026 02:59:07 GMT+0530 (India Standard Time)
వైసీపీతో పొత్తుపై తేల్చేసిన పురందేశ్వరి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పొత్తు ఉంటుందనే వార్తలను బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి ఖండించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...జగన్, పవన్ తో బీజేపీ కలిసి పనిచేస్తుందనడం అవాస్తవమన్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే దిగుతుందని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు లేవనెత్తిన అంశాలకు కేంద్రం సమాధానం చెప్పిందన్నారు. ఢిల్లీలో భావసారుప్యం లేని నలుగురు సీఎంలు కలిశారని, వారు ఎంత కాలం కలిసి పనిచేస్తారో చెప్పలేమన్నారు.
Next Story

