Thu Mar 19 2026 04:13:47 GMT+0530 (India Standard Time)
బీజేపీ గొంతెమ్మ కోరిక

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకున్న నాటి నుంచి ఆ పార్టీపై, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తోంది బీజేపీ. రోజుకు ఇద్దరు, ముగ్గురు నాయకులు ప్రెస్ మీట్లు కచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ముందుండే బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పోమవారం మీడియాతో మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ప్రతిపక్ష నేతలపై టీడీపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
Next Story

