Mon Feb 02 2026 01:59:29 GMT+0000 (Coordinated Universal Time)
టెంట్ కూడా వేసుకోలేని వారు దేశాన్ని నిర్మిస్తారా..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోల్ కత్తాలో జరిగిన భారీ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ... బీజేపీని గద్దెదించి దేశాన్ని రక్షించాలన్నదే తమ ఆకాంక్ష అని, తమకు ప్రధాని కుర్చీపై మక్కువ లేదన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ‘‘బీజేపీ హఠావో... దేశ్ బచావో’’ పేరిట భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. మతకలహాల నెత్తుటి మరకలు అంటుకున్న వారు దేశాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. ‘‘టెంట్ కూడా సరిగ్గా వేసుకోలేని వారు దేశాన్ని ఎలా నిర్మిస్తారు..?’’ అని ఆమె ఎద్దేవా చేశారు. ఇటీవల బెంగాల్ లోని మిడ్నాపూర్ లో నరేంద్ర మోదీ సభకు వేసిన టెంట్ కూలిపోయిన సంగతి తెలిసిందే.
Next Story

