Thu Mar 19 2026 21:26:42 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేసీఆర్ తో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్ తో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు, కేసీఆర్ ఢిల్లీ పర్యటన వంటి పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ రాజకీయవర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. అయితే, హైదరాబాద్ లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని ఏర్పాట్లు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కోరనున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలపై తన ఆలోచనను బీజేపీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ పంచుకునే అవకాశం కనపడుతోంది. అయితే, గత కొన్నిరోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. బీజేపీ ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం ఇప్పుడు కొత్త ఊహాగానాలకు అవకాశం కల్పిస్తోంది.
Next Story

