Fri Jan 30 2026 17:15:28 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో బీజేపీ నేతలు మూకుమ్మడిగా?
తెలంగాణలో బీజేపీ నేతలు ఈరోజు దీక్షకు దిగనున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రైతుల విషయంలో [more]
తెలంగాణలో బీజేపీ నేతలు ఈరోజు దీక్షకు దిగనున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రైతుల విషయంలో [more]

తెలంగాణలో బీజేపీ నేతలు ఈరోజు దీక్షకు దిగనున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రైతుల విషయంలో ప్రభుత్వం విఫలమయిందని, దానికి నిరసనగా తాము ఒకరోజు దీక్ష చేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. రైతుల నుంచి సకాలంలో పంటలు కొనుగోలు చేయకపోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రైతులకు సంఘీభావంగానే ఒకరోజు దీక్ష చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీ నేతలు ఎవరి ఇళ్లల్లో వారు ఉండి దీక్షలు చేయలాని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆరోపించారు.
Next Story