టిక్కెట్ కోసం బీజేపీ నేతలు కిరోసిన్ డబ్బా పట్టుకుని
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ డివిజన్ లో కాంగ్రెస్ నుంచి వచ్చిన అభ్యర్థికి బీజేపీ టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ… ముషీరాబాద్ నేతలు ఆందోళనకు దిగారు. ముషీరాబాద్ బీజేపీ కార్యాలయం [more]
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ డివిజన్ లో కాంగ్రెస్ నుంచి వచ్చిన అభ్యర్థికి బీజేపీ టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ… ముషీరాబాద్ నేతలు ఆందోళనకు దిగారు. ముషీరాబాద్ బీజేపీ కార్యాలయం [more]

ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ డివిజన్ లో కాంగ్రెస్ నుంచి వచ్చిన అభ్యర్థికి బీజేపీ టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ… ముషీరాబాద్ నేతలు ఆందోళనకు దిగారు. ముషీరాబాద్ బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడంతో పాటు రోడ్డుపై బైఠాయించారు. డివిజన్ లో బీజేపీకి కష్టపడి పనిచేసేవారికి ఎవరికి టికెట్ ఇచ్చినా తాము మద్దతు ఇస్తామని తెలిపారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పార్టీ కోసం పనిచేసిన నాయకులకు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో ఆత్మహత్య లకు సిద్ధమవుతామని హెచ్చరించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని ఆందోళన వ్యక్తం చేసారు. లక్ష్మణ్ రాని పక్షంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని బాటిల్ లో పెట్రోల్ పోసుకొని ధర్నా కు దిగారు.