Sat Jan 31 2026 06:35:36 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్ కౌంటర్ చేస్తామంటున్న బీజేపీ నేత

సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవడం బీజేపీ నేతలకు సరదాగా మారిపోయింది. తాజాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షులు దిలీప్ ఘస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ లోని జల్పైగురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ...తమ కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎన్ కౌంటర్ చేస్తామని హెచ్చరించారు. తమ వద్ద బుల్లెట్ల లేక కాదని, తాము తలుచుకుంటే ప్రతీ చోటా శవాలు తేలుతాయని తీవ్రంగా హెచ్చరించారు. దిలీప్ కి ఇటువంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. గతంలో ఆయన పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం వస్తే మమతకు అనుకూలంగా ఉన్న పోలీసుల యూనిఫామ్ లు తొలగిస్తామని హెచ్చరించారు.
Next Story

