Tue Feb 03 2026 00:34:46 GMT+0000 (Coordinated Universal Time)
ఉగ్రవాదులకు మజ్లీస్ అండ...

హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. మజ్లీస్ పార్టీ ఉగ్రవాదులకు అండగా ఉన్నందునే ఇలా జరుగుతుందని ఆయన ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రోహింగ్యాలకు, అక్రమ చొరబాటుదారులకు మజ్లీస్ అండగా ఉంటోందని, పెద్దసంఖ్యలో విదేశీయులు అక్రమంగా హైదరాబాద్ లో ఉంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న మజ్లీస్ పార్టీకి టీఆర్ఎస్ మద్దతుగా ఉండటం సరికాదన్నారు. హైదరాబాద్ లో కూడా ఎన్ఆర్సీ చట్టాన్ని అమలు చేసి అక్రమ చొరబాటుదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story

