Tue Mar 17 2026 03:45:20 GMT+0530 (India Standard Time)
ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ కీలక వ్యాఖ్యలు

బీజేపీ లేకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎంఐఎంతో ఉంటే టీఆర్ఎస్ కు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రచారంపై సంతృప్తి ఉందని, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ నేతలు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారని పేర్కొన్నారు. ఇక, ఎన్నికల ఏర్పాట్లలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆయన ఆరోపించారు.
Next Story

