Mon Mar 23 2026 05:59:54 GMT+0530 (India Standard Time)
టీడీపీలో కొబ్బరి చిప్పలు... చెప్పులు దొంగలించే వారు

తెలుగుదేశం పార్టీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. నిన్న సాయంత్రం ఓ టీవీ ఛానల్ డిబేట్ లో బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావును టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ దూషించడాన్ని ఆయన ఖండించారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటూ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కొబ్బరి చిప్పలు... చెప్పులు దొంగలించే వారు టీడీపీలో నాయకులుగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు విపత్తును కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.
Next Story

