Thu Mar 26 2026 08:22:10 GMT+0530 (India Standard Time)
ఏంది...సామీ.. ఇక ఓం నమశ్శివాయేనా...?
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. పుదుచ్చేరిలో బీజేపీ కేవలం ఆరు స్థానాల్లో గెలిచింది.

కొవ్వొత్తి చుట్టూ పురుగులు తిరుగుతుంటాయి. కానీ ఎప్పటికైనా అవి వాటిలో మాడి మసై పోతాయి. వెలుగును చూసి ప్రేమతో దగ్గరకు వెళితే వాటికి మరణమే శరణ్యం. గొర్రె కసాయి వాణ్నే నమ్ముతుందన్నది సామెత. రాజకీయాల్లోనూ అంతే బీజేపీతో పొత్తు పెట్టుకున్న వారెరవరూ సుఖంగా ఉన్న దాఖలాలు లేవు. అన్ని చోట్ల తామే అధికారంలో ఉండాలనుకునే పార్టీ అది. గతంలో ఎన్ని సంఘటనలు చూసినా రాజకీయ పార్టీలు మాత్రం దానితోనే పొత్తుకు పరుగులు పెడుతుంటాయి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి ఈ విషయం కొన్ని నెలలు ఆలస్యంగా అర్ధమయింది. అర్థమయ్యే సరికి ఆయన సీటు కిందకు నీళ్లు చేరిపోయే పరిస్థితి ఏర్పడింది. పుదుచ్చేరిలో అధికార కూటమిలో విభేదాలు ఏర్పాడ్డాయి.
డీఎంకేను అడ్డుకట్ట వేయడానికి...
2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. పుదుచ్చేరిలో బీజేపీ కేవలం ఆరు స్థానాల్లో గెలిచింది. కానీ అక్కడ డీఎంకే, కాంగ్రెస్ చెరి రెండు స్థానాల్లో గెలిచాయి. ఎన్ఆర్ కాంగ్రెస్ పది స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్లు ఆరుస్థానాల్లో గెలిచారు. . తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది కాబట్టి పక్కనే ఉన్న పుదుచ్చేరిలో తాము పవర్ లో ఉండాలని భావించి ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామిని ముఖ్యమంత్రి పదవికి అయిష్టంగానే అప్పగించింది. పుదుచ్చేరిని కూడా తమిళనాడులో ఒక భాగంగానే పరిగణిస్తారు కాబట్టి తమిళనాడు ఎటూ పోయింది కాబట్టి పుదుచ్చేరిలో జెండా ఎగరేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
అధికారాన్ని దక్కించుకునేందుకు...
కానీ బీజేపీని గుడ్డిగా నమ్మిన రంగస్వామి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. కానీ ఇప్పుడు సీన్ సితార అవుతోంది. సీనియర్ అయిన ఆయనను కాదని బీజేపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు పావులు కదుపుతుంది. మొత్తం 33 మంది శాసనసభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎన్ రంగస్వామితో పాటు మరో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. స్పీకర్ గా బీజేపీకి చెందిన ఆర్ సెల్వన్ ఉన్నారు. పదవుల పంపకాల్లో గత కొంతకాలంగా రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి.
తమ వైపు తిప్పుకునేందుకు...
దీంతో ఇండిపెండెంట్ సభ్యులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి కొందరిని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలను బీజేపీ ప్రారంభించింది. స్వతంత్ర అభ్యర్థులకు మంత్రి పదవులు ఇచ్చి తాము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ కసరత్తు ప్రారంభించింది. బీజేపీ మంత్రి ఓం నమశ్శివాయ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఏమో రంగస్వామిని దించేసి తన వారిని ముఖ్యమంత్రిగా చేయాలన్న ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం కూడా ఉన్నట్లు సమాచారం. అసలే బీజేపీకి మిత్రులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. ఉన్న మిత్రులను కూడా అధికారం కోసం దూరం చేసుకునేందుకు బీజేపీ ఏమాత్రం వెనుకడగు వేయడం లేదు. ఇప్పుడు రంగస్వామి కూడా అప్రమత్తమయ్యారు. రంగస్వామికి ముఖ్యమంత్రి పదవీ గండం తప్పదన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
- Tags
- bjp
- nr congress
Next Story

