Sun Feb 01 2026 17:10:23 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీకి ప్రముఖ నేత గుడ్ బై

బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు, ది పయోనీర్ మీడియా సంస్థ ఎడిటర్ చందన్ మిత్రా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2003, 09లో ఆయన బీజేపీ తరుపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ కీలక నేతగా ఎదిగారు. పార్టీకి కష్టకాలంలో మద్దతుగా నిలిచారు. అయితే, తన రాజీనామాకు గల కారణాలను ఆయన వెల్లడించలేదు. ఆయన రాజీనామాపై పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బీజేపీ కురువృద్ధుడు ఎల్.కే అద్వానీకి సన్నిహితుడిగా ముద్రపడ్డ మిత్రాకు మోడీ-షా ధ్వయం నాయకత్వంలో అంతగా ప్రాధాన్యత లభించలేదు. దీనికి తోడు ఆయన కైరానా ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పార్టీపై విమర్శలు ఎక్కిపెట్టారు. చెరువు రైతుల గురించి బీజేపీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Next Story

