Sat Mar 21 2026 17:47:24 GMT+0530 (India Standard Time)
ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ

ఎన్నికల వేళ రాజస్థాన్ లో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన సొంత నియోజకవర్గం బర్మేర్ లో నిర్వహించిన స్వాభిమాన్ ర్యాలీలో ఆయన ఈ ప్రకటన చేశారు. జశ్వంత్ సింగ్ కు గత లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వనప్పటి నుంచి మన్వేంద్ర కూడా పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. కమలాన్ని పట్టుకోవడం నా తప్పని ఆయన రాజీనామా సందర్భంగా పేర్కొన్నారు. అసలే రాజస్థాన్ లో బీజేపీ గట్టు పరిస్థితులు ఎదుర్కొబోతోందనే అంచనాల నేపథ్యంలో పార్టీలో లుకలుకలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి.
Next Story

