Mon Mar 16 2026 08:43:21 GMT+0530 (India Standard Time)
తుపాను వేళ... ఇతర రాష్ట్రాలకు సీఎం ఎలా వెళ్తారు..?

ఓవైపు పెథాయ్ తుఫానుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రాజకీయ స్వార్థ అవసరాలు చూసుకుంటున్నారని బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారాలకు వెళ్లడం చంద్రబాబుకు తగునా అని ప్రశ్నించారు. ఇతర పార్టీల నేతలకు నీతులు చెప్పే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
Next Story

