Thu Mar 19 2026 12:05:17 GMT+0530 (India Standard Time)
భోగాపురం నుంచి బాత్ రూం వరకు

భోగాపురం ఎయిర్ పోర్టును రియల్ ఎస్టేట్ సెజ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భోగాపురం నుంచి బాత్ రూంల వరకు చంద్రబాబు దేనినీ వదలకుండా అవినీతి చేస్తున్నారని, చంద్రబాబుపై సీబీఐ విచారణ కోసం కోర్టులకు వెళ్తామని స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు బడ్జెట్ రూ.2,250 కోట్ల నుంచి రూ.4 వేల కోట్లకు పెంచారని, ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకొచ్చినా జీఎంఆర్ కు కట్టబెట్టాలని చూశారని ఆరోపించారు. భోగాపురం, ఓర్వకల్లు, నెల్లూరు ఎయిర్ పోర్టులను చంద్రబాబు వ్యాపారమయం చేస్తారని విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.
Next Story

