Mon Mar 23 2026 21:04:53 GMT+0530 (India Standard Time)
జూబ్లీహిల్స్ లోని బాలయ్య ఇంటిపై...?

జూబ్లీహిల్స్ లోని బాలకృష్ణ ఇంటిని బీజేపీశ్రేణులు ముట్టడించాయి. నిన్న చంద్రబాబు ధర్మపోరాట దీక్షలో మోడీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు జూబ్లీహిల్స్ లోని బాలయ్య ఇంటిని ముట్టడించే ప్రయత్నంచేశారు. బాలకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీకార్యకర్తలు డిమాండ్ చేశారు. బాలకృష్ణ ఇంటి గేట్లు ఎక్కి మరీ నినాదాలు చేశారు. పోలీసులు బీజేపీకార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
Next Story

