Sat Aug 13 2022 05:45:31 GMT+0000 (Coordinated Universal Time)
తొలిరోజే బిగ్ బాస్ లో మొదలయిన టాస్క్

బిగ్ బాస్ సీజన్ 5 మొదలయింది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా ప్రారంభమయిన బిగ్ బాస్ లో కంటెస్ట్ లు అందరూ హౌస్ కు చేుకున్నారు. భిన్న మనస్తత్వాలు, విభిన్న ప్రొఫెషనల్స్ ను ఈసారి బిగ్ బాస్ కు ఎంపిక చేశారు. ఈ సీజన్ లో హౌస్ కు ఎంటర్ అయిన వారిలో యూట్యూబర్ సిరి, సీరియల్ నటుడు విజయ్ సన్నీ, లహరి, ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్ లోబో, సీరియల్ నటి ప్రియ, సూపర్ మోడల్, ర్యాపర్ జెస్సీ, ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, హమీదా, నటరాజ్, సరయు, విశ్వ, ఉమాదేవి, లు వచ్చారు. తొలి రోజే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు టాస్క్ లు ఇచ్చారు. సింగిల్ బెడ్ కోసం జరిగిన ఈ పోటీలో విజయసన్నీ, ట్రాన్స్ జెండర్ ప్రియాంకలు విజయం సాధించారు.
Next Story