Wed Feb 12 2025 07:32:12 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్సార్ కాంగ్రెస్ కు భారీ షాక్..?
కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉంటూ వైసీపీలో కొనసాగుతున్న గౌరు [more]
కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉంటూ వైసీపీలో కొనసాగుతున్న గౌరు [more]

కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉంటూ వైసీపీలో కొనసాగుతున్న గౌరు కుటుంబం పార్టీని వీడనుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గౌరు చరిత కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, రానున్న ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ విషయమై జగన్ హామీ ఇవ్వలేదనే అసంతృప్తిలో వారు ఉన్నారు. దీంతో వారు రెండుమూడు రోజుల్లో అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. కాగా, వచ్చె నెల 6వ తేదీన వారు టీడీపీలో చేరుతారని తెలుస్తోంది.
Next Story