Thu Mar 19 2026 00:10:26 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : టీఆర్ఎస్ కి భారీ షాక్

ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 23న మేడ్చెల్ లో జరుగనున్న బహిరంగ సభలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన పార్టీ మారుతారని ఇటీవలే రేవంత్ రెడ్డి ఉప్పందించారు. అయితే, ఆ వార్తలను ఆయన తోసిపుచ్చారు. మంత్రి కేటీఆర్ కూడా ఆయనతో భేటీ అయ్యి బుజ్జగించారు. దీంతో అంతా సర్దుకుందనే సమయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మహేందర్ రెడ్డికి పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తనను చిన్నచూపు చూస్తున్నారని ఆయన పార్టీ పట్ల గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు.
Next Story

