Fri Jan 30 2026 15:54:17 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బీజేపీకి మరో భారీ షాక్

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. కర్ణాటకలోని జయనగర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్యారెడ్డి 3,775 ఓట్లతో గెలుపొందారు. సౌమ్యరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రామలింగారెడ్డి కూతురు. గత నెలలో ఎన్నికలు జరిగిన సమయంలో బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ ఆకస్మికంగా మరణించారు. దీంతో జయనగర ఎన్నిక వాయిదా పడింది. ఈ ఎన్నికలో బీజేపీ తరుపున ప్రహ్లాద్ పోటీ చేయగా కాంగ్రెస్ తరుపున సౌమ్యారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం 80 సీట్లకు చేరింది. ఇంతకుముందు జరిగిన రాజరాజేశ్వరనగర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, సిట్టింగ్ స్థానంగా ఉన్న జయనగరలో ఓడిపోవడం, సానుభూతి కూడా పనిచేయకపోవడంతో బీజేపీకి షాక్ తగిలినట్లయింది.
Next Story

