Sun Mar 15 2026 14:04:36 GMT+0530 (India Standard Time)
వెంకయ్య నాయుడికి భూమన లేఖ
విరసం నేత వరవరరావును విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. వరవరరావు [more]
విరసం నేత వరవరరావును విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. వరవరరావు [more]

విరసం నేత వరవరరావును విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. వరవరరావు 81 ఏళ్ల వయసులో ఉన్నారని, ఆయన ఆరోగ్యం బాగాలేదని, మానవత్వంతో విడుదల చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. వరవరరావు, వెంకయ్య నాయుడు, తాను కలసి ఎమెర్జెన్సీ రోజుల్లో హైదరబాద్ ముషీరాబాద్ జైలులో గడిపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వరవరరావు తన గురువని భూమన కరుణాకర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఆయనను విడుదల చేసి ప్రాణాపాయం నుంచి కాపాడాలని వెంకయ్యనాయుడికి రాసిన లేఖలో కోరారు.
Next Story