Mon Mar 16 2026 02:02:53 GMT+0530 (India Standard Time)
పీసీసీ కూర్పు పై భట్టి అసంతృప్తి.. ఢిల్లీలో మకాం
పీసీసీలో పదవుల నియామకంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఢిల్లీకి వెళ్లి పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ తో [more]
పీసీసీలో పదవుల నియామకంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఢిల్లీకి వెళ్లి పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ తో [more]

పీసీసీలో పదవుల నియామకంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఢిల్లీకి వెళ్లి పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ తో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. కొందరు నేతలకు పీసీసీ లో స్థానం కల్పించక పోవడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. బాల్కొండ అనిల్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అక్కడ మహేష్ గౌడ్ క అవకాశం కల్పించామని ఠాగూర్ వివరణ ఇచ్చారు. సోనియాగాంధీ, రాహుల్ ఆమోదంతోనే కమిటీని నియమించామని ఠాగూర్ భట్టి విక్రమార్క కు తెలిపారు. పీసీసీ కూర్పు సరిగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Next Story