Thu Mar 19 2026 16:42:00 GMT+0530 (India Standard Time)
గుజరాత్ లో వన్ సైడ్ విక్టరీ
గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది

గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. 151 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఏ రౌండ్ లోనూ బీజేపీ వెనక్కు తగ్గడం లేదు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ ను ఏడోసారి ఆ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత ఎన్నికల కంటే...
బీజేపీ 151 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎనిమిది స్థానాల్లోనూ, ఇతరులు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. పెద్దగా మార్పులు కనిపించే అవకాశం లేదు. ఏకపక్షంగానే బీజీపీ అధికారాన్ని చేపట్టే అవకాశముంది. గత ఎన్నికల కంటే మరింత ఎక్కువగా ఈ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలను బీజేపీ చేజిక్కించుకునే అవకాశాలున్నాయి.
Next Story

