Sat Dec 06 2025 01:51:16 GMT+0000 (Coordinated Universal Time)
Karnataka results : జేడీఎస్‌కు బీజేపీ భారీ ఆఫర్
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో భారతీయ జనతా పార్టీ ప్లాన్ బి రెడీ చేసుకుంది. జేడీఎస్‌తో టచ్‌లోకి వెళ్లింది

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో భారతీయ జనతా పార్టీ ప్లాన్ బి రెడీ చేసుకుంది. జేడీఎస్ నాయకులకు బీజేపీ నేతల నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. మ్యాజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ చేరుకోకపోతే జేడీఎస్, బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు చూసిన బీజేపీ అధినాయకత్వం జేడీఎస్ తో మంతనాలు జరపాలని ఆదేశించినట్లు తెలిసింది.
కేంద్రంలోనూ...
ఇందుకోసం జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా ముఖ్యమైన పదవులు ఇచ్చేందుకు కమలం పార్టీ సిద్ధమవుతుందని తెలుస్తోంది. కేంద్రంలో కూడా కొందరికి మంత్రి పదవులు ఆఫర్ చేసే అవకాశముంది. జేడీఎస్ మద్దతిస్తే బీజేపీ అన్ని విధాలుగా సహకరిస్తామని నాయకత్వం జేడీఎస్‌కు రాయబారం పంపినట్లు సమాచారం. ఢిల్లీనుంచి వచ్చిన ఆదేశాల మేరకు జేడీఎస్‌కు బీజేపీ నుంచి బంపర్ ఆఫర్ లభించినట్లు తెలిసింది. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా, ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పినట్లు సమాచారం.
Next Story

